Court Collections: బాక్సాఫీస్ కలెక్షన్లతో కుమ్మేస్తున్న కోర్ట్.. నాలుగు రోజుల్లో ఎన్ని కోట్లంటే?

Court Collections: బాక్సాఫీస్ కలెక్షన్లతో కుమ్మేస్తున్న కోర్ట్.. నాలుగు రోజుల్లో ఎన్ని కోట్లంటే?

నాని నిర్మించిన కోర్ట్ మూవీ భారీ వసూళ్లను దక్కించుకుంటోంది. చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ హిట్గా నిలిచింది. ఈ మూవీ 4 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.28.9 కోట్లకి పైగా గ్రాస్ వసూలు చేసినట్లు మేకర్స్ అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ వారం బాక్సాఫీస్ వద్ద కోర్ట్  తన వసూళ్ల ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. మీ టిక్కెట్లను ఇప్పుడే బుక్ చేసుకోండి అని మేకర్స్ తెలిపారు. అలాగే ఈ మూవీ రూ.17.40 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

కోర్ట్ మూవీ ఫస్ట్ వీకెండ్ కంప్లీట్ చేసుకుని అదే తరహా జోరు కొనసాగిస్తోంది. దాంతో ఈ మూవీ థియేటర్స్ లో ఎక్కువ లాంగ్ రన్ ఉండేలా కనిపిస్తోంది. ఓవర్సీస్‌లో కూడా ఈ మూవీ డీసెంట్ కలెక్షన్స్ రాబడుతోంది. యుఎస్ఏ మార్కెట్‌లో ఇప్పటికే $700K మార్కును దాటేసి, 7 రోజుల్లోనే మిలియన్ డాలర్ క్లబ్‌లోకి ఎంటర్ అవ్వడానికి రెడీగా ఉంది. అలాగే దాదాపు అన్నిచోట్లా స్క్రీన్ కౌంట్ కూడా పెరుగుతుండడం విశేషం.

ట్రేడ్ అనలిస్ట్ సాక్నిల్క్ నివేదిక ప్రకారం:

'కోర్ట్: స్టేట్ vs ఎ నోబడీ' ఇండియా బాక్సాఫీస్ వద్ద నాలుగు రోజుల్లో రూ.17.40 కోట్లు వసూలు చేసింది. ఫస్ట్ డే రూ.4.15 కోట్లు, రెండవ రోజు రూ.5 కోట్లు వసూలు చేసింది. మూడవ రోజు ఏకంగా రూ. 5.65 కోట్లు, నాలుగోవ రోజు రూ.2.60 Cr వసూలు చేసింది.

ఈ మూవీ రూ.9కోట్ల బడ్జెట్‍తో తెరకెక్కింది. ఇప్పటికే లాభాల్లోకి అడుగుపెట్టి విజయవంతంగా దూసుకెళ్తోంది. ఇక సెకండ్ వీక్ షురూ చేసిన కోర్ట్ తన తుది తీర్పుతో ఎంతటి వసూళ్ల ప్రభంజనం సృష్టించనుందో ఆసక్తి రేపుతోంది.

ALSO READ | Prithiveeraj: ఎన్నో క‌ష్టాలు ప‌డ్డాను.. సందీప్‌ రెడ్డి వంగా 'యానిమల్తో' నా లైఫ్ మారిపోయింది

పోక్సో చ‌ట్టంలోని లోతుపాతుల‌ను ఆలోచ‌నాత్మ‌కంగా ఈ సినిమాలో చూపించారు మేకర్స్. కులం, ప‌గ ప్ర‌తీకారాల కోసం పోక్సో లాంటి చ‌ట్టాల‌ను కొంద‌రు తమ డబ్బు, అధికార మదంతో ఎలా దుర్వినియోగం చేస్తున్నారు? చ‌ట్టంలోని లోసుగుల కార‌ణంగా ఏ త‌ప్పు చేయ‌ని అమాయ‌కులు ఏ విధంగా బ‌ల‌వుతున్నార‌న్న‌ది అర్థ‌వంతంగా కోర్ట్ సినిమాలో చూపించాడు డైరెక్టర్ రామ్ జగదీశ్.