
హీరో నాని నిర్మించిన కోర్ట్ మూవీ నేడు మార్చి 14న థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీ రిలీజ్ ముందే పెయిడ్ ప్రీమియర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ కోర్టు రూమ్ డ్రామాకి ప్రీమియర్ వసూళ్లు ఎంత వచ్చాయో చూద్దాం.
కోర్ట్ వసూళ్లు:
ప్రముఖ నివేదిక ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 100కి పైగా ప్రీమియర్ షోలతో వచ్చిన కోర్ట్ మూవీకి రూ.40 లక్షలకి పైగా వసూళ్లు వచ్చాయని సమాచారం. జస్ట్ ప్రీమియర్కే ఇంత అమౌంట్ రావడం కోర్ట్ మూవీ సక్సెస్కి ప్రధాన బలంగా నిలిచింది. దాంతో నేడు (మార్చి 14న) థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అయితే, ముందస్తు బుకింగ్ వెబ్‌సైట్‌ల ఆధారంగా.. ఈ మూవీ తొలిరోజు రూ. 1.25 కోట్ల కలెక్షన్‌లను సాధించవచ్చని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
Also Read:-కాజల్ వస్తుందంటూ హోలీ టికెట్లు.. తీరా వెళితే జూనియర్ ఆర్టిస్టులు కూడా లేరు..!
పోక్సో చట్టంలోని లోతుపాతులను ఆలోచనాత్మకంగా ఈ సినిమాలో చూపించారు మేకర్స్. కులం, పగ ప్రతీకారాల కోసం పోక్సో లాంటి చట్టాలను కొందరు తమ డబ్బు, అధికార మదంతో ఎలా దుర్వినియోగం చేస్తున్నారు? చట్టంలోని లోసుగుల కారణంగా ఏ తప్పు చేయని అమాయకులు ఏ విధంగా బలవుతున్నారన్నది అర్థవంతంగా కోర్ట్ సినిమాలో చూపించాడు డైరెక్టర్.
'కోర్ట్' బడ్జెట్, ప్రీ రిలీజ్ బిజినెస్:
కోర్ట్ మూవీ దాదాపు రూ.9 కోట్ల బడ్జెట్ అయిందని సినీ వర్గాల సమాచారం. అందులో నాన్ థియేట్రికల్ హక్కుల మొత్తంగా రూ.9.5కోట్లు వచ్చాయని చెబుతున్నారు. ఇందులో ఓటీటీ రైట్స్ ద్వారా రూ.8 కోట్లు వచ్చాయని, ఆడియో ద్వారా 30 లక్షలు వచ్చాయని సినీ క్రిటిక్స్ మాట్లాడుకుంటున్నారు. ఇక ఈ మూవీ రిలీజ్ కి ముందే అలోమోస్ట్ పెట్టిన మొత్తాన్ని రాబట్టేలా బిజినెస్ చేసింది. దాంతో ఈ మూవీకి ఓ రూ. 2 కోట్లు వస్తే, బ్రేక్ ఈవెన్ సాధిస్తుంది. ఇక ప్రీమియర్, మొదటి రోజు వసూళ్లు కలుపుకుంటే ఆ మొత్తాన్ని కూడా రాబట్టే ఛాన్స్ ఉందని సినీ క్రిటిక్స్ చెబుతున్నారు.
కథేంటంటే:
చంద్ర శేఖర్ అలియాస్ చందు (రోషన్)కు చదువు సరిగా అబ్బదు. ఇంటర్ ఫెయిల్ అయి పార్ట్ టైం పనులు చేసుకుంటూ కాలం వెళ్లదీస్తుంటాడు. అలా వచ్చిన ప్రతి పనిని కాదనుకుండా ఉపాధి కోసం చేస్తుంటాడు. ఈ క్రమంలో ఓ ఇంటి దగ్గర వాచ్ మెన్ ఉద్యోగంలో జాయిన్ అవుతాడు. అలా అనుకోకుండా అక్కడ ఓ పెద్దింటి అమ్మాయి, ఇంటర్ చదువుతున్న జాబిలి (శ్రీదేవి)తో ప్రేమలో పడుతాడు. ఇక వీరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. అలా ఫోన్ లో మాట్లాడుకోవడం, కలవడం ఇలా చాలా లోతుగా వెళుతారు.
ఈ క్రమంలో ఓ సంఘటన మూలాన వీరి ప్రేమ విషయం జాబిలి ఇంట్లో తెలుస్తోంది. ఇక ప్రాణం కంటే పరువు, స్థాయి ముఖ్యమని బ్రతికే కోపిష్టి అయిన జాబిల్లి మామయ్య మంగపతి (శివాజీ) దృష్టికి వస్తుంది. ఆ తర్వాత తన పలుకుబడిని అంత ఉపయోగించి, తమ ఇంట్లో అమ్మాయిని రేప్ చేశాడని చందుని పోక్సో చట్టం కింద అరెస్ట్ చేయిస్తాడు.
దాంతో బెయిల్ కూడా దొరకకుండా చందు మీద పోక్సో యాక్ట్ పెట్టించిన లాయర్ దాము (హర్షవర్ధన్) కోర్టులో ఎలాంటి ఎత్తులు వేశాడు? మరి చందుని ఎలాగైనా బయటకు తీసుకు వచ్చేందుకు పేరున్న పెద్ద లాయర్ మోహన్ రావు (సాయి కుమార్) అసిస్టెంట్ తేజ (ప్రియదర్శి) ఏం చేస్తారు?
అసలు పోక్సో చట్టం ఏం చెబుతుంది? నేరం రుజువైతే చందుకు ఎలాంటి శిక్ష పడుతుంది? కోర్ట్‌లో జరిగిన వార్ ఏంటి? ఫైనల్‌గా చందుని ఈ కేసు నుంచి బయటకి తీసుకొచ్చారా? లేదా అనేది సినిమా థియేటర్లో చూసి తెలుసుకోవాల్సిందే.