Court collections Day 1: ప్రియదర్శి "కోర్ట్" ఫస్ట్ డే కలెక్షన్స్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. ఎంత కలెక్ట్ చేసిందంటే..?

Court collections Day 1: ప్రియదర్శి "కోర్ట్" ఫస్ట్ డే కలెక్షన్స్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. ఎంత కలెక్ట్ చేసిందంటే..?

Court collections Day 1: తెలుగు యంగ్ హీరో, కమెడియన్ ప్రియదర్శి నూతన డైరెక్టర్ రామ్ జగదీష్ కాంబినేషన్ లో వచ్చిన ‘కోర్ట్ – స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’ శుక్రవారం థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో ప్రియదర్శి లాయర్ పాత్రలో నటించగా  శివాజీ, సాయి కుమార్, రోహిణి, హర్షవర్ధన్, హర్ష్ రోషన్, శ్రీదేవి కీలక పాత్రలు పోషించారు. మైనర్లపై లైంగిక దాడికి పాల్పడిన సమయంలో విధించే పోక్సో యాక్ట్ గురించి అవగాహన కల్పిస్తూ ప్యూర్ కోర్ట్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో తీసిన ఈ సినిమాకి ఆడియన్స్ నుంచి అమేజింగ్ రెస్పాన్స్ వస్తోంది. ఇక హీరో నాని ఈ సినిమా ప్రమోషన్స్ లో ఎమోషనల్ గా మాట్లాడటం, సినీ క్రిటిక్స్ నుంచి పాజిటివ్ గా రివ్యూలు రావడం, ఓవరాల్ గా చిత్ర యూనిట్ కృషి వంటివాటి కారణంగా కలెక్షన్స్ కూడా బాగానే రాబడుతోంది.. 

Also Read : మంగపతి లాంటి పాత్ర నా పాతికేళ్ల కల..

అయితే ఈ సినిమా రిలీజ్ కి ముందు చిత్ర యూనిట్ పలు పెయిడ్ ప్రీమియర్స్ వేశారు. దీంతో దాదాపుగా రూ.40 లక్షలకిపైగా కలెక్షన్స్ సాధించింది. ఇక రిలీజ్ తర్వాత దాదాపుగా రూ.8.10 కోట్లు (గ్రాస్) ఫస్ట్ డే(Court collections Day 1) కలెక్ట్ చేసినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా టాలీవుడ్ సినీ వర్గాలు షాక్ అవుతున్నాయి. అయితే ఇంతకి ముందు కోర్టు చట్టాల గురించి చెబుతూ తీసిన స్టోరీలు టాలీవుడ్ లో పెద్దగా క్లిక్ కాలేదు.. 

కానీ "కోర్ట్" సినిమా మాత్రం సూపర్ హిట్ అయ్యింది. అంతేకాదు ఈ సినిమాతో టాలీవుడ్ వెటరన్ హీరో శివాజీకి కూడా మంచి కంబ్యాక్ లభించింది.. ఓవరాల్ గా చూస్తే కోర్ట్ సినిమాకి డీసెంట్ ఓపెనింగ్స్ లభించాయని చెప్పవచ్చు.. అయితే మంచి పాజిటివ్ టాక్ రావడంతో ఈ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది.

ALSO READ మహానటి సావిత్రి జీవితం అందుకే నాశనమైంది: గీతూ రాయల్

‘కోర్ట్ – స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’ స్టోరీ ఏమిటంటే..?
చంద్ర శేఖర్ అలియాస్ చందు (రోషన్) ఓ పెద్దింటి అమ్మాయి, ఇంట‌ర్‌ చ‌దువుతున్న జాబిలి (శ్రీదేవి)తో ప్రేమలో పడుతాడు. దీంతో ఇంట్లోవాళ్ళకి తెలియకుండా చాటుగా కలుసుకుంటూ ఉంటారు. అలాగే బీచ్ లు, సినిమాలు అంటూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుంటారు.. చివరికి వీరిద్దరి వ్యవహారం ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది. అయితే జాబిలి మామయ్య మంగపతి (శివాజీ) ప్రాణం కంటే పరువు, స్థాయి ముఖ్యమని నమ్ముతుంటాడు. దీంతో జాబిలి లవ్ మేటర్ తెలియడంతో చందు ని తన పలుకుబడి ని ఉపయోగించి పలు అక్రమ కేసులు పెట్టి కటకటాల్లోకి నెట్టిస్తాడు. ఈ క్రమంలో మైనర్లపై లైంగిక దాడి చేసిన వారిపై పెట్టె పోక్సో యాక్ట్ క్రింద కేసు పెట్టిస్తాడు.. ఆ తర్వాత ఏమైంది..? చివరికి చందు జైలు నుంచి బయటికి వచ్చాడా..? చందుని బయటికి తీసుకు రావడానికి ప్రియదర్శి ఎలాంటి చర్యలు తీసుకున్నాడు.? ఇలాంటి విషయాలు తెలియాలంటే తెరపై చూడాల్సిందే..