
ఇటీవల విడుదలై మంచి హిట్ అందుకున్న తెలుగు మూవీ 'కోర్ట్'. ఈ మూవీని కేవలం రూ.10 కోట్ల బడ్జెట్ తో రూపొందించగా, దాదాపు రూ.57 కోట్లకి పైగా గ్రాస్ కలెక్షన్ సాధించింది. నేచురల్ స్టార్ నాని సమర్పించిన ఈ చిత్రాన్ని రామ్ జగదీశ్ తెరకెక్కించాడు.
హర్ష రోషన్, శ్రీదేవి, ప్రియదర్శి, శివాజీ, సాయి కుమార్ కీలక పాత్రల్లో నటించారు. మార్చి 14న రిలీజైన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. దాంతో ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ లవర్స్ కి గుడ్ న్యూస్.
తాజాగా 'కోర్ట్' డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ని 'నెట్‌ఫ్లిక్స్'(Netflix) ఫిక్స్ చేసింది. ఈనెల11 నుంచి స్ట్రీమింగ్ కి అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. రానున్న ఈ రెండ్రోజుల్లో అధికారికంగా ప్రకటన వెలువడనుంది.
Also Read:-ఒమన్ బీచ్‍లో విజయ్, రష్మిక.. పుకార్లకు దారితీసిన కొత్త ఫోటోలు..
ఈ చిత్రానికి అన్ని వర్గాల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే, థియేటర్లలో తెలుగులో మాత్రమే రిలీజ్ అయిన కోర్ట్.. ఓటీటీలో మాత్రం ఏకంగా ఐదు భాషల్లో అందుబాటులోకి తీసుకురానున్నారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులోకి వస్తుంది.
ఈ మూవీలో లవ్ స్టోరీతో పాటు, పోక్సో కేసు, కోర్టులో వాదనల చుట్టూ ఆసక్తికరంగా కథనం నడిపించాడు దర్శకుడు రామ్ జగదీశ్. డబ్బు బలంతో గవర్నమెంట్ అధికారులను లొంగదీసుకోవడం, చట్టంలోని లొసుగులని వాడుకోవడం కళ్ళకి కట్టినట్లుగా చూపించాడు. దానికితోడు కోర్ట్ డ్రామా ఇంటెన్స్గా ఉండటంతో మిగతా భాషల్లో కూడా మంచి వ్యూస్ దక్కించుకునే అవకాశం ఉంది.