ఓవర్సీస్‌లో కలెక్షన్లు కుమ్మేస్తున్న కోర్ట్.. నిర్మాత‌గా నాని రికార్డ్.. చిన్న సినిమాలకు ప్రాణం

ఓవర్సీస్‌లో కలెక్షన్లు కుమ్మేస్తున్న కోర్ట్.. నిర్మాత‌గా నాని రికార్డ్.. చిన్న సినిమాలకు ప్రాణం

నాని నిర్మాణంలో ప్రియ‌ద‌ర్శి, శివాజీ, రోష‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన కోర్ట్ మూవీ మరో రికార్డ్ నెలకొల్పింది. లేటెస్ట్గా ఈ మూవీ ఓవర్సీస్‌లో వన్‌ మిలియన్‌ డాలర్ల క్లబ్‌లోకి చేరింది. ఈ విషయాన్ని ఓవర్సీస్లో డిస్ట్రీబ్యూట్ చేసిన ప్రత్యంగిరా సినిమాస్ అధికారిక ప్రకటన చేసింది. ఈ భారీ మొత్తం వసూళ్లు కంటెంట్ తో తెరకెక్కే సినిమాలకు ఊపిరిగా నిలిచింది.

ఈ లేటెస్ట్ రికార్డ్తో నాని నిర్మాతగా వన్‌ మిలియన్‌ డాలర్ల క్లబ్‌లో చేరాడు. అయితే, తాను హీరోగా చేసిన సినిమాలు సైతం ఓవర్సీస్లో ఈ మార్క్ను అందుకున్నాయి. ఇప్పుడు నిర్మాతగా చేరుకోవడం విశేషం. అంతేకాకుండా ఓవర్సీస్ ప్రీ సేల్‌ బుకింగ్స్‌లోను అదరగొట్టింది. ఇకపోతే ఈ మూవీ ఇండియా వైడ్గా రూ.34.19కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. 

ఈ 2025 ఏడాదిలో వెంకటేష్ నటించిన 'సంక్రాంతికి వస్తున్నాం' తర్వాత, కోర్ట్ సినిమా టాలీవుడ్‌లో రెండో హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది. మార్చి 14న రిలీజైన ఈ మూవీ పది రోజుల్లోనే రూ.50కోట్ల మార్క్ను చేరుకోవడం విశేషం.  

డైరెక్టర్ రామ్ జగదీష్ తీసుకున్న సరికొత్త పాయింట్ అందరినీ ఆలోచింపజేసేలా చేసింది. పోక్సో చ‌ట్టంలోని లోతుపాతుల‌ను ఆలోచ‌నాత్మ‌కంగా ఈ సినిమాలో చూపించారు.

పోక్సో చ‌ట్టం గురించి తెలియ‌ని కోణాల‌ను ఈ సినిమాలో ట‌చ్ చేసి విజయం సాధించాడు. కులం, ప‌గ ప్ర‌తీకారాల కోసం పోక్సో లాంటి చ‌ట్టాల‌ను కొంద‌రు ఎలా దుర్వినియోగం చేస్తున్నారు? చ‌ట్టంలోని లొసుగుల కార‌ణంగా ఏ త‌ప్పు చేయ‌ని అమాయ‌కులు ఏ విధంగా బ‌ల‌వుతున్నార‌న్న‌ది కళ్ళకు కట్టినట్లుగా చూపించాడు.

ALSO READ : ఏప్రిల్‌‌ 4 నుంచి ఆహాలో హోం టౌన్‌‌