
నాని నిర్మించిన కోర్ట్ మూవీ భారీ సక్సెస్ అందుకుంది. మార్చి 14న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ 3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.24.4కోట్లకి పైగా గ్రాస్ వసూలు చేసింది.
లేటెస్ట్గా మార్చి 17న మేకర్స్ అధికారిక పోస్టర్ రిలీజ్ చేశారు. " బ్లాక్‌బస్టర్ తీర్పు.. బాక్సాఫీస్ అదిరిపోయే ఫస్ట్ వీక్.. కోర్ట్ 3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.24.4కోట్లకి పైగా గ్రాస్ వసూలు చేసింది. మీ దగ్గరలో ఉన్న థియేటర్స్లో చూడండి" అంటూ మేకర్స్ వెల్లడించారు. అలాగే ఈ మూవీ రూ.14.8 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించినట్లు సమాచారం.
BLOCKBUSTER VERDICT 🔥
— Wall Poster Cinema (@walpostercinema) March 17, 2025
SENSATIONAL FIRST WEEKEND AT BOX OFFICE ❤️🔥#CourtTelugu collects a gross of 24.4+ CRORES WORLDWIDE in 3 days 💥💥
Book your tickets for #Court now!
▶️ https://t.co/C8ZZHbyhHW#CourtStateVsANobody ⚖️
Presented by Natural Star @NameisNani
Starring… pic.twitter.com/TzarCJ6fCC
ట్రేడ్ అనలిస్ట్ సాక్నిల్క్ నివేదిక ప్రకారం,
'కోర్ట్: స్టేట్ vs ఎ నోబడీ' ఇండియా బాక్సాఫీస్ వద్ద రూ.14.8 కోట్లు వసూలు చేసింది. ఫస్ట్ డే రూ.4.15 కోట్లు, రెండవ రోజు రూ.5 కోట్లు వసూలు చేసింది. మూడవ రోజు ఏకంగా రూ. 5.65 కోట్లు వసూలు చేసింది. ఈ మూవీ రూ.9కోట్ల బడ్జెట్‍తో తెరకెక్కింది. ఇప్పటికే లాభాల్లోకి అడుగుపెట్టి విజయవంతంగా దూసుకెళ్తోంది. ఇక సెకండ్ వీక్ షురూ చేసిన కోర్ట్ తన తుది తీర్పుతో ఎంతటి వసూళ్ల ప్రభంజనం సృష్టించనుందో ఆసక్తి రేపుతోంది.
Also Read:-అర్జున్ S/O వైజయంతి టీజర్ రిలీజ్.. తల్లీ కొడుకుల 'ప్రేమ V/s యుద్ధం'..
ఇకపోతే, మార్చి 16, 2025 ఆదివారం నాటికి ఈ మూవీ తెలుగు రాష్ట్రాలలో 58.40% ఆక్యుపెన్సీ నమోదు చేసుకుంది. వివిధ షో సమయాల్లో ఆక్యుపెన్సీ మారుతూ వచ్చింది, ఉదయం షోలు 39.29%, మధ్యాహ్నం షోలు 65.40%, సాయంత్రం షోలు 70.84% మరియు రాత్రి షోలు 58.06%.
థియేటర్లలో ఈ మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. పోక్సో చట్టంలోని లోతుపాతులను ఆలోచనాత్మకంగా ఈ సినిమాలో చూపించారు మేకర్స్. కులం, పగ ప్రతీకారాల కోసం పోక్సో లాంటి చట్టాలను కొందరు తమ డబ్బు, అధికార మదంతో ఎలా దుర్వినియోగం చేస్తున్నారు?
చట్టంలోని లోసుగుల కారణంగా ఏ తప్పు చేయని అమాయకులు ఏ విధంగా బలవుతున్నారన్నది అర్థవంతంగా కోర్ట్ సినిమాలో చూపించాడు డైరెక్టర్. ఈ సినిమాతో మరో టాలెంటెడ్ దర్శకుడిని నాని వెండితెరకు పరిచయం చేశారు.