ఫోన్ ట్యాపింగ్ కేసు :  రాధాకిషన్ రావు బెయిల్ పై ఇవాళ కోర్టు తీర్పు

ఫోన్ ట్యాపింగ్ కేసు :  రాధాకిషన్ రావు బెయిల్ పై ఇవాళ కోర్టు తీర్పు

ఫోన్ ట్యాపింగ్ కేసులో టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు బెయిల్ పై ఇవాళ నాంపల్లి కోర్టు తీర్పు ఇవ్వనుంది. రాధాకిషన్ రావు బెయిల్ పిటిషన్ పై ఇప్పటికే వాదనలు ముగిశాయి. రాధాకిషన్ రావు అరెస్ట్ ను తప్పుబడుతూ వాదనలు వినిపించారు లాయర్ ఉమా మహేశ్వరరావు. ఆయన వాదనకు కౌంటర్ ఇచ్చారు పీవీ సాంబశివ రెడ్డి.  కాగా ఇటీవలే ఈ కేసులో నిందితులుగా ఉన్న భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్ రావుల బెయిల్ పిటిషన్లను కూడా నాంపల్లి కోర్టు కొట్టివేసింది.

ఈ కేసులో భాగంగా పోలీసుల వాదనలతో ఏకీభవించిన కోర్టు నిందితులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను తిరస్కరించింది. కేసు విచారణ కీలక దశలో ఉన్న సమయంలో నిందితులకు బెయిలు మంజూరు చేస్తే సాక్షుల్ని ప్రభావితం చేస్తారని పేర్కొన్నారు.  ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు .. పోలీసులు వాదనతో ఏకీభవించి నిందుతుల బెయిలు పిటిషన్‌లను క్యాన్సిల్ చేసింది.