ప్రేమించుకున్నారు.. కానీ వరుసకు అన్నాచెల్లెల్లు ప్రేమికుల రోజే ఘోరం

ప్రేమకు ఏజ్ సంబధం లేదు కానీ, మరి రిలేషన్ పరిస్థితి ఏంటి? అంటే ఏ వరసైన వారిని ప్రేమించ వచ్చు అనే ప్రశ్న మీకు ఎప్పుడైనా తట్టిందా? చాలా బంధాలకు ప్రేమ ఓ రిలేషన్ క్రియేట్ చేసి ఒక్కటి చేస్తుంది. ఆల్ రెడీ ఓ రిలేషన్ లో ఉన్న వారి అది కాదనుకోని మరో బంధాన్ని కలుపుకోగలరా? సమాజం అంగీకరిస్తుందా?  అన్నా చెల్లెల్ల వరస అయ్యే వారు ప్రేమించుకుంటే వారి పరిస్థితి ఏంటి? వినడానికి వింతగానే అనిపించవచ్చు. కానీ ఇలాంటి ఘటనల్లో చివరికి మిగిలింది విషాదమే. లవర్స్ డే రోజే (ఫిబ్రవరి 14)న ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. మహోబా జిల్లా చరఖారీ ఏరియాకు చెందిన డాక్టర్ చదివిన సురేందర్(22), 20 ఏళ్ల అమ్మాయి ఇద్దరు ప్రేమించుకున్నారు. చిన్ననాటి నుంచి కలిసి చదువుకున్న వీరు నాలుగేళ్ల క్రితం ప్రేమలో పడ్డారు.  

ఒకరికోకరు అంటే చాలా ఇష్టం. ఈ విషయం వారి ఇంట్లో తెలియదు. ఇంట్లో చెప్పే ధైర్యం చేయలేక, కలిసి బ్రతికే పరిస్థితి లేక ఈ ప్రేమ జంట వాలెంటెన్స్ డే రోజే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. సురేందర్ పొలం దగ్గరికి వెళ్లి పురుగుల మందు తాగగా, ఆ అమ్మాయి వాళ్ల ఇంట్లోనే క్రిమిసంహారక మందు తాగింది. సురేందర్ హాస్పటల్ తీసుకెళ్లే క్రమంలో జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పి చనిపోయాడు. యువతి ఇంట్లోనే ప్రాణాలు విడిచింది. సూసైడ్ లపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.