ప్రస్తుత కాలంలో బంధాలకు విలువ లేకుండా పోతుంది. వావివరుసలు మరిచి ప్రవర్తిస్తున్నారు. వరుసకు అన్నాచెల్లెళ్లు అయ్యే యువతి, యువకుడు ప్రేమించుకొని పారిపోయి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అది నచ్చని కుటుంబసభ్యులు వారిని వెతికి పట్టుకొచ్చి విషం పోసి చంపారు. ఈ ఘటన చత్తీస్‌ఘర్‌లోని దుర్గ్ జిల్లాలో ఆదివారం జరిగింది.
దుర్గ్ జిల్లా ఐజి వివేకానంద్ సిన్హా ప్రకారం.. జిల్లాకు చెందిన శ్రీహరి (21), ఐశ్వర్య (20) వరుసకు అన్నాచెల్లెళ్లు. వీరి తండ్రులు స్వయంగా అన్నాదమ్ములు. శ్రీహరి, ఐశ్వర్య గత కొన్ని నెలలుగా ప్రేమించుకుంటున్నారు. వారి బంధాన్ని తమ కుటంబసభ్యులు ఒప్పుకోరని భావించిన వీరిద్దరూ.. సెప్టెంబర్‌లో ఇంటి నుంచి పారిపోయారు. అయితే వారికోసం వెతుకుతున్న కుటుంబసభ్యులకు శ్రీహరి, ఐశ్వర్య అక్టోబర్ 7న చెన్నైలో కంటపడ్డారు. అక్కడి నుంచి వారిద్దరినీ దుర్గ్‌లోని తమ ఇంటికి తీసుకువచ్చారు. వచ్చినప్పటి నుంచి వారిద్దరికీ ఎంతో నచ్చజేప్పాలని కుటుంబసభ్యులు ప్రయత్నించారు. అయినా కూడా శ్రీహరి, ఐశ్వర్య వినకపోవడంతో.. ఐశ్వర్య అన్న చరణ్ కొప్పల్ మరియు ప్రేమికుల మామ రాము ఇద్దరూ కలిసి వారికి విషం పోసి చంపారు. చుట్టుపక్కల వారి సమాచారం ప్రకారం.. ప్రేమికులు తిరిగి వచ్చినప్పటి నుంచి కుటుంబంలో అంతర్గతంగా గొడవలు జరుగుతున్నట్లు సమాచారం.
శ్రీహరి, ఐశ్వర్యలను హత్యచేసిన తర్వాత శివనాథ్ నది ఒడ్డున వారిని దహనం చేశారు. స్థానికుల సమాచారం మేరకు హత్యచేసిన నిందితులను విచారించగా.. నేరం చేసినట్లు ఒప్పుకున్నారు. వారిద్దరినీ కస్టడీలోకి తీసుకొని నిందితులపై ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఐజి సిన్హా తెలిపారు.
For More News..