'వర్క్ ఫర్ హోమ్'కు సీజేఐ గ్రీన్ సిగ్నల్

'వర్క్ ఫర్ హోమ్'కు సీజేఐ గ్రీన్ సిగ్నల్

దేశంలో పెరుగుతున్న కొవిడ్-19 కేసుల నేపథ్యంలో భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డీవై చంద్రచూడ్  ఏప్రిల్ 5న కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా కేసులు తీవ్రమవుతున్న సందర్భంగా లాయర్లు వర్చువల్ పద్దతిలోనూ కోర్టుకు హాజరు కావచ్చని వెల్లడించారు. దేశంలో మళ్లీ కరోనా విజృంభిస్తున్నందున లాయ‌ర్లు వ‌ర్చువ‌ల్ ప‌ద్ధ‌తి(virtual mode)లో కోర్టుకు హాజ‌రుకావాల‌నుకుంటే వారికి సహకరిస్తామన్నారు. ఆన్ లైన్ లో విచారణ చేపట్టవచ్చని తెలిపారు. లేదంటే వారు హైబ్రిడ్ మోడ్ లో కోర్టులోనైనా విచారణలో పాల్గొనవచ్చని సీజేఐ స్పష్టం చేశారు.

ఇటీవల దేశంలో పెరుగుతున్న కోవిడ్ కేసులపై వార్తాపత్రికల్లో వస్తోన్న కథనాలను చూసామని న్యాయవాదులు హైబ్రిడ్ మోడ్‌ లో లేదా ఆన్ లైన్ లోనూ విచారణ చేపట్టవచ్చని సీజేఐ జస్టిస్ చంద్రడూడ్ తెలిపారు. కరోనా కారణంగా ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా ఇన్ఫెక్షన్ రేటు, కొవిడ్ కేసుల సంఖ్యను పరిగణలోకి తీసుకున్న తర్వాతే అంటే..  ఏప్రిల్ 4, 2022 నుంచి సుప్రీంకోర్టులో కేసుల ఫిజికల్ హియరింగ్ మోడ్‌కు తిరిగి వచ్చింది.

పెరుగుతున్న కేసులు:

భారతదేశంలో కొవిడ్ కేసులు గత కొన్ని రోజులుగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లోనే 4వేలకు పైగా కేసులు నమోదు కావడం గమనార్హం. నాలుగు రోజులుగా 3వేలకు పైగా కేసులు నమోదవుతుండగా... ఏప్రిల్ 4వ తేదీన ఒక్కరోజే 4వేలకు పైగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోది. ఇవి ఏప్రిల్ 3 నమోదైన కేసులతో పోలిస్తే 46 శాతం మేర పెరిగినట్టు తెలుస్తోంది.

https://twitter.com/ANI/status/1643492744202178560