దేశంలో కరోనా సబ్ వేరియంట్ JN.1 కేసులు రోజురోజుకూ పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు నమోదైన కేసుల్లో వ్యక్తులు తేలికపాటి లక్షణాలను కలిగి ఉండగా.. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం, దేశంలో ఈ రోజు (డిసెంబర్ 22) 640 కేసులు నమోదయ్యాయి. దీంతో క్రియాశీల కేసుల సంఖ్య 2,997కి చేరుకుంది.
దేశంలో కొవిడ్-19 మొత్తం కేసుల సంఖ్య ఇప్పుడు 4.50 కోట్లు (4,50,07,212)కి చేరుకుంది. కేరళలో ఓ మరణం నమోదవడంతో మృతుల సంఖ్య 5,33,328కి చేరుకుందని డేటా పేర్కొంది. వ్యాధి నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,44,70,887కి పెరగ్గా.. ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ ప్రకారం కరోనా రికవరీ రేటు 98.81 శాతంగా ఉంది. మరణాల రేటు 1.19 శాతంగా ఉందని, దేశంలో ఇప్పటివరకు 220.67 కోట్ల కొవిడ్ -19 డోస్‌లు పంపిణీ చేసినట్టు మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ చూపుతోంది.
A total of 22 JN.1 COVID variant cases were reported in India till December 21. No clustering of COVID-19 reported so far, all cases have mild symptoms: Official sources
— ANI (@ANI) December 22, 2023