COVID ALERT: తెలంగాణలో కొత్తగా 6 కరోనా కేసులు

COVID ALERT: తెలంగాణలో కొత్తగా 6 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కరోనా బులెటిన్ విడుదల చేసింది తెలంగాణ వైద్యారోగ్య శాఖ. రాష్ట్రంలో కొత్తగా 6  కరోనా కేసులు నమోదు అయ్యాయిని ప్రకటించింది. ఇప్పటివరకు 20 యాక్టివ్ కేసులు ఉన్నాయని.. వీరిలో 19 మందికి చికిత్స కొనసాగుతోంది. కరోనా నుంచి ఒకరు రికవరీ అయ్యారు. కొత్తగా వచ్చిన కేసుల్లో హైదరాబాద్ లో 4, మెదక్ లో 1, రంగారెడ్డిలో 1 చొప్పున కరోనా కేసులు నమోదు అయ్యాయి.  

గురువారం (డిసెంబర్21)  మొత్తం 925 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 54 మందికి సంబంధించిన కోవిడ్ టెస్ట్ రిజల్ట్స్ రావాల్సి ఉంది. బుధవారం కూడా 6 కేసులు నమోదు అయ్యాయి. కోవిడ్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్య శాఖ సూచించింది. 

కోవిడ్ లక్షణాలుంటే పరీక్షలు చేయించుకోవాలని.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేరాలని వైద్యారోగ్య శాఖ అధికారులు తెలిపారు. ప్రభుత్వం కరోనా పరీక్షలు, రోగులకు అవసరమైన సదుపాయాలు అందించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. దేశవ్యాప్తంగా జేఎన్ 1 విస్తరిస్తున్న క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.