దేశంలో మళ్లీ విస్తరిస్తున్న కరోనా.. కొత్త కేసులు ఎన్నంటే..

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గత 3 రోజులుగా 20 వేలకు పైగా కొవిడ్ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 21 వేల 880 కరోనా కేసులు రాగా.. ఇప్పటి వరకు దేశంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 4 కోట్ల 38 లక్షల 47వేల 065కు చేరింది. రోజువారీ పాజిటివిటీ రేటు 98.46శాతంగా నమోదు అయింది. అలాగే మరణాలు 1.20శాతం ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. 
గడచిన 24 గంటల్లో కరోనా వైరస్ బారిన పడిన వారిలో 60 మంది కోలుకోలేక చనిపోయారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ప్రస్తుతం లక్షా 49 వేల 482 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొవిడ్ నుంచి మరో 21 వేల 219 మంది కోలుకుని ఆస్పత్రుల నుండి డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకు 201 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ చేసింది కేంద్రం.