కరోనా మళ్లీ విజృంభిస్తోంది. ఇటీవలి కాలంలో కొవిడ్ వైరస్ కేసులు వేగంగా పెరుగుతున్న క్రమంలో పలు ఆగ్నేయాసియా దేశాలు ఆంక్షలు విధించాయి. ఫేస్ మాస్క్‌ను తప్పనిసరి చేశాయి. ఈ దేశాల్లో అంతర్జాతీయ ప్రయాణికులు, స్థానికులు కోసం విమానాశ్రయంలో తప్పనిసరిగా ముఖానికి మాస్క్‌లు ధరించాలని కోరారు. ఈ కఠినమైన చర్యల్లో భాగంగా, విమానాశ్రయాలలో టెంపరేచర్ స్కానర్ లను కూడా ఉంచారు. ఈ దేశాలు కొవిడ్, ఫ్లూ, న్యుమోనియా, ఇతర శ్వాసకోశ వ్యాధికారక వంటి వివిధ రకాల వ్యాధులను తగ్గించడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాయి.
సింగపూర్‌లో కొవిడ్ కేసులు
కరోనావైరస్ వేగంగా వ్యాప్తి చెందడానికి గల కారణాలపై సింగపూర్‌లోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పందించింది. కేసుల పెరుగుదలకు జనాభా రోగనిరోధక శక్తి క్షీణించడం, పరస్పర చర్యలతో సహా అనేక కారణాల వల్ల కావచ్చని, పండుగల సీజన్ లో ప్రయాణాలు కావచ్చన్నారు. ప్రస్తుతం సింగపూర్‌లో 60 శాతానికి పైగా కొవిడ్ 19 కేసులు నమోదైనట్టు తెలుస్తోంది. 21 నవంబర్ 2023 నుంచి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. స్థానికంగా ఉన్న BA.2.86 లేదా JN.1 ఎక్కువగా వ్యాపించే లేదా తీవ్రమైనదని సూచించే సూచనలు ప్రస్తుతానికి లేవని మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఇదే తరహాలో ఇండేనేషియా, మలేషియాలోనూ కొవిడ్ 19 కేసులు పెరుగుతున్నాయి. కరోనా టీకాలు వేసుకోవాలని, మాస్క్‌లు ధరించాలని, చేతులను పదే పదే శుభ్రం చేసుకుంటూ ఉండాలని, వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలని అక్కడి ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. ఇండోనేషియా అధికారులు కొన్ని సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద థర్మల్ స్కానర్‌లను ఏర్పాటు చేశారు. బాటమ్ ఫెర్రీ టెర్మినల్, జకార్తా ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయంలోనూ స్కానర్ లను అందుబాటులో ఉంచారు. SCMP నివేదిక ప్రకారం, వ్యాప్తి నియంత్రణలో ఉందని సమాచారం.