- జాతీయ విద్యావిధానంలో రాష్ట్రాలు ఏం చేయాలో స్పష్టంగా చెప్పలేదు
- కేంద్రం ఏం అడుగుతోందో వాళ్లకే క్లారిటీ లేదు
- రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్
హైదరాబాద్: విద్యారంగంపై కరోనా తీవ్ర ప్రభావం చూపిందన్నారు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్. కేంద్రం జాతీయ విద్యా విధానం ప్రకటించింది కానీ... రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలో స్పష్టంగా చెప్పడం లేదన్నారు. అసలు కేంద్రం ఏం అడుగుతోందో.... వాళ్లకే క్లారిటీ లేదన్నారు. హైదరాబాద్ హైటెక్స్ లో ట్రస్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎడ్యుకేషన్ ఎక్స్ -పోను వినోద్ కుమార్ ప్రారంభించారు. కేంద్ర ప్రకటించిన కొత్త జాతీయ విద్యా విధానంలో రాష్ట్రాలు ఏం చేయాలో స్పష్టంగా చెప్పడం లేదు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకమైన పరిస్థితి ఉండడం లల్ల కేంద్రం ప్రకటించిన జాతీయ విద్యావిధానంపై రాష్ట్రాల్లో గందరగోళం ఉందన్నారు. దీన్ని సరిచేసే ప్రయత్నాలేవీ చేస్తున్న దాఖలాలు లేవన్నారు వినోద్ కుమార్.
పాఠశాలల సంఘం అధ్యక్షులు వై.శేఖర్ రావు మాట్లాడుతూ కోవిడ్ విద్యారంగాన్ని తీవ్రంగా దెబ్బతీసిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి: