బాక్సర్లకు కొవిడ్‌‌-19 ఇన్సూరెన్స్‌‌

బాక్సర్లకు కొవిడ్‌‌-19 ఇన్సూరెన్స్‌‌

న్యూఢిల్లీ:  ఇండియా టాప్‌‌ బాక్సర్లు, కోచింగ్‌‌ స్టాఫ్‌‌కు కొవిడ్‌‌–19 ఇన్సూరెన్స్‌‌ చేయించారు. పోస్ట్‌‌ కరోనా తర్వాత  నేషనల్‌‌ క్యాంప్‌‌లో ట్రెయినింగ్‌‌ తీసుకునే బాక్సర్లు, కోచ్‌‌లు, సపోర్ట్‌‌  స్టాఫ్​కు ఈ స్పెషల్‌‌ ఇన్సూరెన్స్‌‌ వర్తిస్తుంది.  దీనితో పాటు క్యాంప్‌‌ నిబంధనల ప్రకారం వారందరికీ  సపరేట్‌‌గా మెడికల్‌‌ ఎమర్జెన్సీ, యాక్సిడెంట్‌‌ ఇన్సూరెన్స్‌‌ కూడా చేయించారు. నేషనల్‌‌ క్యాంప్‌‌లకు హాజరయ్యే వారి కోసం బాక్సింగ్‌‌ ఫెడరేషన్‌‌ ఆఫ్‌‌ ఇండియా (బీఎఫ్‌‌ఐ)  ఇప్పటికే సొంతంగా స్టాండర్డ్‌‌ ఆపరేటింగ్‌‌ ప్రొసిజర్‌‌ (ఎస్‌‌ఓపీ)ని విడుదల చేసింది. ఇప్పుడు ఇన్యూరెన్స్‌‌ రెగ్యులేటరీ అండ్‌‌ డెవలప్‌‌మెంట్‌‌ అథారిటీ (ఐఆర్‌‌డీఏ) గైడ్‌‌లైన్స్‌‌ ప్రకారం  అథ్లెట్లకు కొవిడ్‌‌–19 ఇన్సూరెన్స్‌‌ కవర్‌‌ చేయించిన తొలి నేషనల్‌‌ స్పోర్ట్స్‌‌ ఫెడరేషన్‌‌గా నిలిచింది. ‘క్యాంప్‌‌లో ఉండే బాక్సర్లు, కోచింగ్‌‌ స్టాఫ్‌‌కు  రూ. 5 లక్షల వరకు బేసిక్‌‌ ఇన్సూరెన్స్‌‌ లభిస్తుంది. ఇందులో 50 నుంచి 70 శాతం (రూ. 2.5-–3.5 లక్షలు)  వరకు కొవిడ్‌‌–19 ఇన్సూరెన్స్‌‌ కవర్‌‌ ఉంటుంది. నేషనల్‌‌ క్యాంప్‌‌ స్టార్ట్‌‌ అయిన వెంటనే ఈ పాలసీ అమల్లోకి వస్తుంది’ అని బీఎఫ్‌‌ఐ సీనియర్‌‌ అధికారి ఒకరు చెప్పారు.

For More News..

ఇంటి నుంచి పనిచేయడానికే ఇష్టపడుతున్నరు

కూలీల తరలింపునకు 13 కోట్లు ఖర్చుపెట్టిన తెలంగాణ ప్రభుత్వం

విదేశాల్లో దూసుకుపోతున్న ఇండియన్ ఓటీటీలు