పారిస్‌‌‌‌లో కొవిడ్ కలవరం

పారిస్‌‌‌‌: కొవిడ్ కారణంగా టోక్యో ఒలింపిక్స్‌‌‌‌ ఏడాది ఆలస్యంగా అవగా.. పారిస్‌‌‌‌ గేమ్స్‌‌‌‌లోనూ కొవిడ్ కలవరం మొదలైంది. మెగా గేమ్స్‌‌‌‌ ఆరంభానికి ముందు  ఐదుగురితో కూడిన ఆస్ట్రేలియా విమెన్స్‌‌‌‌ వాటర్‌‌‌‌ పోలో టీమ్‌‌‌‌ వైరస్‌‌‌‌ బారిన పడింది. ఆస్ట్రేలియా చెఫ్‌‌‌‌ డి మిషన్‌‌‌‌ అన్నా మియర్స్‌‌‌‌ బుధవారం ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రస్తుతం వీళ్లంతా ఐసోలేషన్‌‌‌‌లో ఉన్నారని, ప్రాక్టీస్‌‌‌‌కు మరికొంత టైమ్‌‌‌‌ పడుతుందని తెలిపింది. 

‘మేం ఇతర శ్వాసకోశ వ్యాధుల మాదిరిగానే కొవిడ్‌‌‌‌ను పరిగణిస్తాం. మా ప్రొటోకాల్స్‌‌‌‌ ప్రకారం చికిత్స అందిస్తాం. ఇతర అనారోగ్యాలకు కూడా ఇదే వర్తిస్తుంది. ఒలింపిక్స్‌‌‌‌ గేమ్స్‌‌‌‌లో ఇలాంటివి సర్వ సాధారణమే. పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు. మా టీమ్‌‌‌‌ మొత్తానికి కొవిడ్‌‌‌‌ టెస్ట్‌‌‌‌లు చేయిస్తాం పాజిటివ్‌‌‌‌గా తేలితే ఐసోలేషన్‌‌‌‌కు పంపిస్తాం’ అని మియర్స్‌‌‌‌ వ్యాఖ్యానించింది.