తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. మరోసారి వైరస్ పంజా విసురుతోంది. ప్రభుత్వ, ప్రైవేటు ఆఫీసుల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ లో కరోనా కలకలం రేపుతోంది. తాజాగా AE, డీఈఈతో పాటు పాటు మరో 25 మంది కార్మికులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. గతంలో 12 మంది కార్మికులకు కరోనా సోకింది. తాజాగా ఇతరులకు కూడా సోకడంతో తోటి సిబ్బంది ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు అధికారులు కార్యాలయాన్ని పూర్తిస్థాయిలో సానిటేషన్ చేశారు. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్యాలయంలోకి ఎవరిని రాకుండా బయటే ఫిర్యాదు బాక్సులను ఏర్పాటు చేశారు. బయట సిబ్బందిని నియమించి సంబంధిత అధికారితో నేరుగా ఫోన్లో మాట్లాడేలా చర్యలు చేపట్టారు.
మరోవైపు తెలంగాణలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 80,138 శాంపిల్స్ పరీక్షించగా... 2,447 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో 1,112 కొత్త కేసులు నమోదు అయ్యాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 235, రంగారెడ్డి జిల్లాలో 183 కేసులు వెల్లడయ్యాయి. 2,295 మంది కరోనా నుంచి కోలుకోగా, ముగ్గురు మరణించారు.
ఇవి కూడా చదవండి:
ప్రికాషనరీ డోస్ గడువు తగ్గించండి
ఎన్టీఆర్ చనిపోయినప్పుడు ఆయన ఆత్మతో మాట్లాడా