- మధ్యప్రదేశ్ సర్కారు రూల్
భోపాల్: కరోనా వ్యాక్సినేషన్ ను స్పీడప్ చేసేందుకు మధ్యప్రదేశ్ సర్కార్ కొత్త రూల్ పెట్టింది. రెండు డోసులు వేసుకున్నోళ్లకే రేషన్ పంపిణీ చేస్తామని ప్రకటించింది. ‘‘వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకున్నోళ్లకే డీలర్లు రేషన్ పంపిణీ చేయాలి. వేసుకోనోళ్లకు టీకా వేసుకొమ్మని సూచించాలి. టీకా వేసుకోనోళ్ల లిస్టు తయారు చేసి, వాళ్లందరికీ రేషన్ పంపిణీ చేయడం ఆపేయాలి” అని శివరాజ్ సింగ్ చౌహాన్ సర్కార్ ఉత్తర్వులిచ్చింది. కాగా, డిసెంబర్ 15 తర్వాత నుంచి టీకా వేసుకోనోళ్లపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తూ సింగ్రౌలి కలెక్టర్ ఇదివరకే ఉత్తర్వులిచ్చారు.