కరోనాతో ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది చనిపోయారు. కరోనాను కంట్రోల్ చేయడానికి వివిధ కంపెనీలు కష్టపడి వీలైనంత త్వరగా వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఆ వ్యాక్సిన్లతో ఇమ్యూనిటి పెరుగుతుండటంతో వాటికి డిమాండ్ పెరిగింది. కాగా.. ఇప్పటివరకు కేవలం పరిమితంగా లభించిన వ్యాక్సిన్లను.. బహిరంగ మార్కెట్లో విక్రయించడానికి డీసీజీఐ అనుమతులిచ్చింది. ఈ క్రమంలో కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలను ఆస్పత్రులు, క్లినిక్ల నుంచి కొనుగోలు చేసే వెసులుబాటు లభించింది. అయితే ఈ వ్యాక్సిన్లు మెడికల్ దుకాణాలలో మాత్రం అందుబాటులో ఉండవని డీసీజీఐ చెప్పింది.
కాగా.. ఆసుపత్రులు మరియు క్లినిక్‌లు వ్యాక్సిన్‌లను కొనుగోలు చేసి.. ప్రజలకు అమ్ముకోవచ్చు. అయితే ఈ అమ్మకాలకు సంబంధించిన డేటా ప్రతి ఆరు నెలలకు ఒకసారి డీసీజీఐకి సమర్పించాలి. ఈ డేటా కోవిన్ యాప్‌లో కూడా అప్‌డేట్ చేయబడుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
#COVID19 | Drugs Controller General of India (DCGI) grants conditional market approval for Covishield and Covaxin pic.twitter.com/q5GO65usPr
— ANI (@ANI) January 27, 2022
For More News..