గుళ్లలో గో సంరక్షణ బోర్డులు

గుళ్లలో గో సంరక్షణ బోర్డులు

హైదరాబాద్, వెలుగు: ‘ఇంటింటికీ తులసి మాత, జగమంతా గోమాత’ నినాదంతో గో పరిరక్షణకు కృషి చేస్తున్న యుగ తులసి ఫౌండేషన్‌‌ బుధవారం మరో కార్యక్రమం ప్రారంభించింది. రాష్ట్రంలోని అన్ని గుడులలో గోరక్షణ, విశిష్టతలను తెలియజేసేలా బోర్డులు ఏర్పాటు చేస్తున్నట్లు ఫౌండేషన్‌‌ వ్యవస్థాపకుడు, టీటీడీ పాలక మండలి సభ్యుడు కొలిశెట్టి శివకుమార్‌‌ తెలిపారు. బోర్డులు ఫ్రీగా ఇస్తున్నామని, కావాల్సిన వారు 8009602588 నంబరులో సంప్రదించాలని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.