అక్రమంగా ఆవులను తరలిస్తున్న వ్యాను బోల్తా: 25ఆవులు మృతి

అక్రమంగా ఆవులను తరలిస్తున్న డీసీఎం వ్యాను బోల్తాపడింది. ఈ ఘటన ములుగు జిల్లా వాజేడు మండలం జగన్నాధపురం దగ్గర ఆవుల వ్యాను బోల్తాపడింది. దీంతో.. వ్యానులోని 25ఆవులు మృతి చెందగా.. మరికొన్ని ఆవులకు గాయాలయ్యాయి. వీటిని హైదరాబాద్ తరలిస్తుండగా ప్రమాదం జరిగింది. జగన్నధపురం గ్రామస్తుల సహకారంతో గాయపడిన ఆవులకు వైద్యం అందిస్తున్నారు అధికారులు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.