
కాగజ్ నగర్, వెలుగు: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని బెజ్జూరు రేంజ్లో పులి దాడిలో ఆవు చనిపోయింది. పెద్ద సిద్దాపూర్కు చెందిన గుర్లు శంకర్ ఆవు శనివారం మేతకు వెళ్లి రాలేదు. అనుమానం వచ్చిన రైతు అటవీ ప్రాంతంలో వెతకగా కళేబరం కనిపించింది. పులి దాడి చంపేసినట్టు గుర్తించారు. బీట్ ఆఫీసర్ వెంకటేశ్ పంచనామా నిర్వహించారు. పులి కదలికలు ఉన్నందున అడవిలోకి ఎవరూ వెళ్లవద్దని సూచించారు.