
వరద ఉధృతికి ఆవులు, గేదెలు కొట్టుకుపోయిన ఘటన కొమురం భీం జిల్లా కాగజ్ నగర్ లో చోటు చేసుకుంది. అందవెల్లి సమీపంలోని పెద్దవాగు దగ్గర పశువులు దాటుతుండగా ఒక్కసారిగా వాగు ఉప్పొంగింది. వరద ఉధృతికి పెద్దఎత్తున ఆవులు, గేదెలు నీటిలో కొట్టుకుపోయాయి.
ముడుకిలోమీటర్ల మేర వరద నీటిలో కొట్టుకుపోయాయి.ఒక్కసారిగా పశువులు వరద నీటిలో కొట్టుకుపోవడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. అయితే, అదృష్టవశాత్తు బ్రిడ్జి పిల్లర్ దగ్గర పశువులు సురక్షితంగా బయటపడటంతో ఊపిరి పీల్చుకున్నారు రైతులు, స్థానికులు.