
- 79 పశువులను గోశాలకు తరలించిన పోలీసులు
నేరడిగొండ, వెలుగు: మహారాష్ట్ర నుంచి పశువులను అక్రమంగా తరలిస్తున్న ఏడు వాహనాలను ఆదిలాబాద్ జిల్లా పోలీసులు గురువారం పట్టుకున్నారు. నేరడిగొండ మండలం రోల్ మామడ టోల్ ప్లాజా వద్ద వాహనాలను సామాజిక కార్యకర్త సాబ్లే సంతోష్ సింగ్ యువకులతో కలిసి ఆపారు. వెంటనే నేరడిగొండ పోలీసులకు సమాచారం అందించారు . దీంతో పోలీసులు తనిఖీలు చేపట్టగా 4 ఐచర్ , 3 బొలెరో వాహనాలలో పశువులు ఉన్నట్లు గుర్తించి , వాహనాల్లోని వారిని అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించారు . సుమారు 79 పశువులను ఇచ్చోడ గోశాలకు తరలించారు .