చెన్నై: ఆవు మూత్రం తాగితే జ్వరం నయమవుతుందని ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ వి.కామకోటి పేర్కొన్నారు. గోమూత్రంలో ఔషధ విలువలున్నాయని చెప్పారు. మన బాడీకి హాని కలిగించే బ్యాక్టీరియాతో పోరాడే శక్తి దానికి ఉందన్నారు. యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ విలువలతోపాటు డైజెస్టివ్ ప్రాపర్టీస్ కూడా ఆవు మూత్రంలో ఉన్నాయన్నారు.
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వెస్ట్ మాంబళంలోని ఓ గోశాలలో జరిగిన పూజా కార్యక్రమంలో కామకోటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన వీడియో తాజాగా బయటపడగా, వైరల్ అయింది. కామకోటి మాట్లాడుతూ తన తండ్రికి జరిగిన సంఘటనను గుర్తుచేశారు. గతంలో ఓసారి తన తండ్రికి జ్వరం వస్తే ఓ సన్యాసిని ఆశ్రయించానని, ఆయన గోమూత్రం తాగాలని సూచించారని చెప్పారు.
ఆయన చెప్పినట్టుగా గోమూత్రం సేవించిన 15 నిమిషాల్లోనే తన తండ్రికి జ్వరం లేకుండా పోయిందని చెప్పుకొచ్చారు. నకిలీ సైన్స్‌ను ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ నేత పి చిదంబర్ ట్వీట్ చేశారు.