ఆవులు చచ్చిపోతున్నాయి.. ఆ కంపెనీపై చర్యలు తీసుకోండి

ఆవులు చచ్చిపోతున్నాయి.. ఆ కంపెనీపై చర్యలు తీసుకోండి

ప్లాస్టిక్ భూతం మూగజీవాల ప్రాణాలు తీస్తుంది. మానవ తప్పిదాల వల్ల నోరులేని జీవులు మృత్యువాత పడుతున్నాయి. పచ్చని పచ్చిక బయళ్లు తినాల్సిన ఆవులు చేత్తకుప్పల్లో ప్లాస్టిక్ వస్తువులు తిని మృత్యువాత పడుతున్నాయి.

మన దేశంలో సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తాం. హిందూ ధర్మం ప్రకారం ఆవును దేవతగా పూజిస్తాం. అయితే ప్రస్తుతం ఆవులు ఎంతో దయనీయమైన స్థితిలో బతుకుతున్నాయి. ముఖ్యంగా పట్టణాల్లో చాలా ఆవులు తిండి లేక వ్యర్థాలను, చెత్తచెదారాన్ని తింటున్నాయి. రోడ్డుపై దొరికిన దాన్నే ఆహారంగా తీసుకుంటున్నాయి. అందులో ఎక్కువ భాగం ప్లాస్టికే ఉంటోంది. 

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లంకాసాగర్ క్రాస్ రోడ్డు సమీపంలో శ్రీ వెంకటేశ్వర ప్లాస్టిక్ ఇండ్రస్ట్రీ పేరుతో వాటార్ ట్యూబులు తయారు చేస్తారు.ట్యూబులు తయారీకి పెద్ద మొత్తంలో ప్లాస్టిక్ వాడాల్సి ఉంది.భారీ ఎత్తున్న ప్లాస్టిక్ ను సేకరించి ఫ్యాక్టరీ ఆరుబయట నిల్వ ఉంచుతారు.

దీంతో మేతకు వచ్చిన ఆవులు ప్లాస్టిక్ వస్తువులను తిని అనారోగ్యం పాలౌతున్నాయి.. అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.చుట్టు ప్రహరీ నిర్మించుకొని అందులో ప్లాస్టిక్ వ్యర్థాలను భద్ర పర్చుకోవాల్సి ఉన్నప్పటికీ ప్లాస్టిక్ ఇండ్రస్ట్రీ యాజమాని మాత్రం పోలాల మార్గంలో ప్లాస్టిక్ వస్తువులు ఉంచటంతో ఆవులు అవి తిని మృత్యువాత పడుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

కంపెనీ నిర్వహణలో నిబంధనలు పాటించని ప్లాస్టిక్ ఇండ్రస్ట్రీ యాజమాని పై చర్యలు తీసుకొవాలని రైతులు కోరుతున్నారు.ఈ ఇండ్రస్ట్రీని మారుముల నడపుతుండటంతో అసలు ఈ కంపెనికి పర్మిషన్లు  ఉన్నాయా లేవా అని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.