జిల్లాలో 8 స్పెషల్​ టాస్క్‌‌‌‌ఫోర్స్ టీంలు: అభిషేక్​మహంతి

కరీంనగర్ క్రైం వెలుగు : ఎన్నికల దృష్ట్యా కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో 8 స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీంలను ఏర్పాటు చేశామని సీపీ అభిషేక్ మహంతి అన్నారు. ఎన్నికల నిర్వహణలో తలెత్తే సమస్యల పరిష్కారంపై జిల్లా పోలీస్ హెడక్వార్టర్స్ సిబ్బందికి మూడు రోజులపాటు పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చారు. శనివారం ట్రైనింగ్​ముగింపు సందర్భంగా సీపీ మాట్లాడుతూ ఫిజికల్ ఫిటినెస్, ఆయుధాల వాడకంపై రిఫ్రెష్ కోర్స్ ట్రైనింగ్​ఇచ్చామన్నారు.

 శాంతి భద్రతల సమస్యలు ఎదురైనపుడు అల్లరి మూకలను చెదరగొట్టడం, తనిఖీలు చేసే తప్పించుకుపోయే వాహనాలను పట్టుకోవడంపై టెక్నిక్స్​చెప్పామన్నారు. ప్రశాంత వాతావరణంలో, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేందుకు పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్నారు.