తిమ్మాపూర్, వెలుగు : కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో పెండింగ్ కేసుల దర్యాప్తును వెంటనే పూర్తిచేయాలని సీపీ అభిషేక్ మహంతి అధికారులను ఆదేశించారు. బుధవారం ఎల్ఎండీ పీఎస్‌ను తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికల్లో సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. అనంతరం స్టేషన్‌లోని పెండింగ్ కేసుల వివరాలపై ఆరా తీశారు. రౌడీ షీటర్లు, నేర చరిత్ర ఉన్నవారిపై నిఘా పెట్టాలన్నారు. కార్యక్రమంలో సీఐ స్వామి, ఎల్ఎండీ ఎస్సై చేరాలు, సిబ్బంది పాల్గొన్నారు.
కరీంనగర్ క్రైమ్, వెలుగు : ఎన్నికల కోడ్ నేపథ్యంలో కమిషనరేట్ వ్యాప్తంగా మంగళవారం రాత్రి కరీంనగర్ లోని హోటళ్లు, లాడ్జీల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు.
లా అండ్ ఆర్డర్‌కు విఘాతం కలిగించొద్దు
హుజూరాబాద్ రూరల్, వెలుగు : ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా సహకరించాలని హుజూరాబాద్ ఏసీపీ శ్రీనివాస్ పేర్కొన్నారు. బుధవారం మండల పరిధిలోని కాట్రపల్లి గ్రామంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందున వాట్సప్ గ్రూపుల్లో అభ్యంతరకరమైన మెసేజ్‌లు షేర్ చేయొద్దన్నారు. లా అండ్ ఆర్డర్‌కు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కవాతులో సీఐ బొల్లం రమేశ్, 40 సీఐఎస్ఎఫ్ జవాన్లు, సిబ్బంది పాల్గొన్నారు.