- సీపీ అభిషేక్ మహంతి
రామడుగు, వెలుగు : నేరాలు జరిగే ప్రాంతాలపై సిబ్బంది నిఘా పెట్టాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి ఆదేశించారు. సోమవారం రాత్రి రామడుగు పీఎస్‌ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్లో పెండింగ్ కేసుల పురోగతిపై ఆరా తీశారు. విజిబుల్ పోలీసింగ్‌పై ఫోకస్ పెట్టాలన్నారు.
గ్రామాలు, వార్డుల్లో వీధి రౌడీలుగా చలామణీ అవుతూ గ్రూపులుగా ఏర్పడి, సామాన్య ప్రజలను బెదిరింపులకు గురిచేసే వారిపై, శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిపై రౌడీ షీట్లు తెరవాలని ఆదేశించారు. తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను యాక్సిడెంట్ జోన్లుగా, బ్లాక్ స్పాట్స్‌గా గుర్తించి, ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఎస్సై వి.శేఖర్, సిబ్బంది పాల్గొన్నారు.