రంజాన్ ​ఏర్పాట్లు పరిశీలించిన సీపీ అంబర్ కిషోర్ ఝా

గ్రేటర్​వరంగల్, వెలుగు: రంజాన్ పండుగను పురస్కరించుకుని ముస్లిం సోదరులు ప్రార్థనలు నిర్వహించుకునే మటెవాడ, ఖిలావరంగల్, కాశీబుగ్గ, చింతాల్, హన్మకొండలోని బొక్కల గడ్డ ఈద్గాలను బుధవారం వరంగల్ సిటీ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా స్థానిక ఏసీపీలతో పాటు సీఐలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ముస్లింలు ప్రార్థనలు నిర్వహించే సమయంలో పోలీస్ బందో బస్తు ఏర్పాట్లను పరిశీలించామన్నారు. ఇందుకు సంబంధించి ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీలు జితేందర్​రెడ్డి, దేవేందర్​రెడ్డి, నందిరాం నాయక్, సీఐలు శ్రీనివాస్, గోపి, సతీశ్, శ్రీధర్, ఎస్​ఐలు, ముస్లిం మత పెద్దలు తదితరులున్నారు.