
గోదావరిఖని, వెలుగు: పోలీస్ సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకే ‘పోలీస్ దర్బార్’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు రామగుండం సీపీ అంబర్ కిశోర్ఝా తెలిపారు. బుధవారం కమిషనరేట్ ఆఫీస్లో పోలీస్ దర్బార్ నిర్వహించి సిబ్బందితో మాట్లాడారు.
సమస్యలను, వినతులను స్వీకరించి వాటిని పరిష్కరించే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ దర్బార్లో సమస్యలను చెప్పడం ఇబ్బందిగా ఉంటే ఆఫీస్కు నేరుగా వచ్చి తెలపవచ్చని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ (అడ్మిన్) సీ.రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్ర రావు, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, ఆర్ఐలు దామోదర్, వామన మూర్తి, సంపత్, ఆర్ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.