నర్సంపేట, వెలుగు : ప్రజలు ఇచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని వరంగల్ సీపీ అంబర్ కిషోర్ ఝా పోలీసు ఆఫీసర్లను ఆదేశించారు. నర్సంపేట ఏసీపీ ఆఫీసును బుధవారం ఆయన తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి, కేసుల వివరాలను ఏసీపీ కిరణ్‌కుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నర్సంపేట సబ్ డివిజన్ పోలీసు ఆఫీసర్లతో సమావేశం నిర్వహించారు.
ఈసందర్భంగా సీపీ మాట్లాడుతూ లా అండ్ఆర్డర్ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు. నర్సంపేట టౌన్‌లోని ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సిందిగా సూచించారు. సమావేశంలో ఈస్ట్ జోన్ డీసీపీ రవీందర్, ట్రైనీ ఎస్పీ మనాన్‌భట్, సీఐ తదితరులున్నారు.