
బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లి టూ టౌన్ పోలీస్ స్టేషన్ ను రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా శుక్రవారం తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ పరిసరాలు పరిశీలించిన అనంతరం సిబ్బందితో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. వారి పనితీరును ప్రశంసించారు. పోలీస్ శాఖపై ప్రజల్లో విశ్వాసం పెరిగేలా విధులు నిర్వహించాలని సూచించారు.
స్థానికులకు భద్రత కల్పించే విషయంలో రాజీ పడవద్దన్నారు. ఆయన వెంట మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్, బెల్లంపల్లి ఏసీపీ రవి కుమార్, బెల్లంపల్లి రూరల్, తాండూర్ సీఐలు అఫ్జలోద్దిన్, కుమారస్వామి, టూ టౌన్ ఎస్సై మహేందర్ ఉన్నారు.