కష్టపడితేనే ఫలితాలు : సీపీ అంబర్ కిషోర్ ఝా

కష్టపడితేనే ఫలితాలు : సీపీ అంబర్ కిషోర్ ఝా

హసన్ పర్తి, వెలుగు : విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి, కష్టపడితేనే ఫలితాలు వస్తాయని వరంగల్ సీపీ అంబర్ కిషోర్ ఝా అన్నారు. శుక్రవారం హనుమకొండ జిల్లా భీమారం ఎస్వీఎస్  ఆధ్వర్యంలో టెక్ క్వెస్ట్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి చీఫ్​గెస్ట్​గా సీపీ అంబర్ కిషోర్ ఝా హాజరై మాట్లాడుతూ డ్రగ్స్, మత్తు పదార్థాల వినియోగం ఎస్వీఎస్ క్యాంపస్ నిర్వహించిన యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రాం ఆకట్టుకుందన్నారు.

అనంతరం మత్తు పదార్థాల వినియోగంతో జరిగే పరిణామాలను వీడియో రూపంలో చూపిస్తూ, విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎస్వీఎస్ ఇన్​స్టిట్యూషన్స్ చైర్మన్ ఎర్రబెల్లి తిరుమల్ రావు, ఏసీపీ దేవేందర్ రెడ్డి, సీఐ రవికుమార్, సైదులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.