ఇవాళ(అక్టోబర్1న) సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు

ఇవాళ(అక్టోబర్1న) సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: మిలాద్‌‌‌‌‌‌‌‌ ఉన్‌‌‌‌‌‌‌‌ నబీ ర్యాలీ నేపథ్యంలో ఆదివారం సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని సీపీ ఆనంద్ తెలిపారు.  సౌత్‌‌‌‌‌‌‌‌,ఈస్ట్‌‌‌‌‌‌‌‌ జోన్ పోలీసులతో పాటు సిటీలోని ఎస్సై, ఆపై స్థాయి అధికారులతో మిలాద్ ఉన్ నబీ ర్యాలీ బందోబస్తుపై శనివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించారు. ర్యాలీ ప్రశాంతంగా ముగిసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గుల్జార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హౌస్, పత్తార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గట్టీ, మదీనా క్రాస్ రోడ్స్ సహా ర్యాలీలు జరిగే ప్రాంతాల్లో ట్రాఫిక్ డైవర్షన్స్ చేయాలని ఆదేశించారు. ఎలాంటి ఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహించాలన్నారు.