హైదరాబాద్ కమిషనరేట్ లో ఈ ఏడాది క్రైమ్ రేట్ పెరిగిందని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ అన్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ కు సంబంధించి 2021 అన్యువల్ క్రైమ్ వివరాలను ఆయన తెలిపారు. కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది 20 వేల 12 కేసులు నమోదయ్యాయని ఆయన అన్నారు. నిందితులకు శిక్షలు పడేలా పర్సంటేజ్ పెంచామన్నారు. అలాగే ఈ ఏడాది డ్రగ్స్, గాంజా ముఠాలపై స్పెషల్ ఫోకస్ పెట్టామన్నారు. అదేవిధంగా ట్రాఫిక్ ఎన్ ఫోర్స్ మెంట్ ద్వారా ఈ ఏడాది 70 లక్షల 3 వేల 12 ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు నమోదు చేశామని సీపీ అంజనీ కుమార్ తెలిపారు.
నగరంలో సైబర్ క్రైమ్ కేసులు కూడా పెరిగాయని సీపీ తెలిపారు. 2019లో 2596 కేసులు నమోదవ్వగా.. 2021లో 3068 కేసులు నమోదయ్యాయన్నారు. వివిధ కేసుల్లో ఈ ఏడాది 80 కోట్ల 54 లక్షల 37 వేల 579 రూపాయలు ఫ్రీజ్ చేశామన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ ద్వారా 10 కోట్ల 49 లక్షల 61 వేల రూపాయలు జరిమానా విధించినట్లు తెలిపారు. మహిళలపై, చిన్నారులపై ఈ ఏడాది అఘాయిత్యాలు పెరిగాయని సీపీ తెలిపారు. నగరంలో రేప్ కేసులు 2019లో 281 కేసులు నమోదు కాగా... 2021లో 328 కేసులు నమోదయ్యాయన్నారు.
For More News..
ఈ జీప్ కిక్ కొడితే స్టార్ట్ అయితది
పిల్లల మొహం చూసి వదిలేయమన్నా కనికరించని మావోలు
చేత కాకపోతే చేతులు ఎత్తేయండి.. మేం చూసుకుంటాం