
సిద్దిపేట రూరల్, వెలుగు: హోలి పండుగను సహజసిద్ధ రంగులతో జరుపుకోవాలని, మద్యం తాగి వాహనాలు నడపొద్దని సీపీ అనురాధ సూచించారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. యువత చెరువుల్లో స్నానాలు చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని, ఈత రానివారు నీటిలోకి వెళ్లకూడదని తెలిపారు. వాహనాలు అతివేగంగా నడపడం మానుకోవాలని సూచించారు.