దుబ్బాక, వెలుగు : సైబర్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సీపీ అనురాధ ప్రజలకు సూచించారు. గురువారం మిరుదొడ్డి పీఎస్‌ను తనిఖీ చేశారు. విలేజ్పోలీస్ఆఫీసర్స్బుక్స్ను పరిశీలించారు. పీఎస్ఆవరణలో ఏసీపీ మధుతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం మాట్లాడుతూ గ్రామాల్లో చోరీలు కట్టడి చేయాలంటే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు.
ప్రజలకు రోడ్‌సేఫ్టీపై అవగాహన కల్పించాలని పోలీసులకు సూచించారు. డ్రగ్స్‌రహిత జిల్లాగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. బెల్ట్ షాపులపై నిఘా పెట్టి యువత మద్యానికి బానిస కాకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో సీఐలు శ్రీనివాస్, కమలాకర్, ఎస్ఐలు పరశురామ్, నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.