
సిద్దిపేట రూరల్, వెలుగు: లాంగ్ పెండింగ్ కేసులు త్వరగా డిస్పోజల్ చేయాలని, స్థానిక ఎన్నికల సందర్భంగా ముందస్తు ప్రణాళికలు తయారు చేసుకోవాలని సీపీ అనురాధ సూచించారు. గురువారం సీపీ ఆఫీస్ లో హుస్నాబాద్ డివిజన్ పోలీస్ అధికారులతో పెండింగ్ కేసులపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల నివారణకు తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, 2023– 24లో పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలన్నారు.
డయల్ 100 కాల్స్ పై అలసత్వం వహించవద్దని, నాన్ బెయిలబుల్ వారెంట్ సాధ్యమైనంత త్వరగా ఎగ్జిక్యూట్ చేయాలని సూచించారు. విధి నిర్వహణలో అలసత్వం వహించే సిబ్బందిపై శాఖా పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్, ఏసీపీ సతీశ్, సీఐలు శ్రీనివాస్, శ్రీను, కిరణ్, రామకృష్ణ, ఏవో యాదమ్మ, సూపరింటెండెంట్ మమ్మద్ ఫయాజుద్దీన్, హుస్నాబాద్ డివిజన్ ఎస్ఐలు పాల్గొన్నారు.