ప్రమోషన్లు బాధ్యతను పెంచుతాయి : సీపీ అనురాధ

ప్రమోషన్లు బాధ్యతను పెంచుతాయి : సీపీ అనురాధ

 సిద్దిపేట రూరల్, వెలుగు: ప్రమోషన్లు బాధ్యతను మరింత పెంచుతాయని సీపీ అనురాధ సూచించారు. సోమవారం ఏఆర్ కానిస్టేబుల్ నుంచి హెడ్ కానిస్టేబుల్ గా ప్రమోషన్ పొందిన మల్లికార్జున్, రమేశ్, శ్రీనివాస్ సీపీని కలిసి బొకే అందజేశారు. అనంతరం సీపీ మాట్లాడుతూ.. ప్రమోషన్లు పొందిన పోలీస్ సిబ్బంది రెట్టింపు ఉత్సాహంతో ప్రజలకు సేవలందించాలని కోరారు. కరీంనగర్ లో జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ లో  రాజన్న సిరిసిల్ల జోన్ తరుపున పాల్గొని మెడల్స్​ సాధించిన పోలీసు సిబ్బందిని అభినందించారు. 

రాష్ట్రస్థాయి కరాటే లో ఏఆర్ కానిస్టేబుల్ ప్రసాద్ గోల్డ్ మెడల్, పవర్ లిఫ్టింగ్ లో ఆర్ ఎస్ఐ రోహిత్ సిల్వర్ మెడల్, బాడీ బిల్డింగ్ లో ఏఆర్ కానిస్టేబుల్ లక్ష్మణ్ సిల్వర్ మెడల్, టెన్నిస్ లో విష్ణు ప్రసాద్, రాజేశ్ కాంస్య పథకాలు, ఖోఖోలో పలువురు కాంస్య పతకాలు సాధించడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్, రాష్ట్ర పోలీసు సంఘం ఉపాధ్యక్షుడు రవీందర్ రెడ్డి 

ఉన్నారు.