
సిద్దిపేట రూరల్, వెలుగు: సైబర్ నేరాల నియంత్రణ తో పాటు అమౌంట్ ఫ్రీజ్ చేసి బాధితులకు అప్పగించడంలో సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచిందని సిద్దిపేట సీపీ అనురాధ తెలిపారు. శుక్రవారం పట్టణంలోని సీపీ ఆఫీసులో సైబర్ వారియర్స్ సిబ్బందికి ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలు, యువకులు, సైబర్ నేరాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు. సైబర్ క్రైమ్‌కి గురైతే బాధితులు ముందుగా నేషనల్ సైబర్ క్రైం విభాగం హెల్ప్ లైన్ నంబర్ 1930 సమాచారం అందించి దగ్గరలోని పీఎస్‌లో కంప్లైంట్చేయాలని సూచించారు. సమావేశంలో సైబర్ సెల్ ఏసీపీ శ్రీనివాస్, ఇన్స్పెక్టర్శేఖర్, సత్యనారాయణ రెడ్డి, శ్రీధర్, ఎస్ఐ నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.