
సిద్దిపేట రూరల్, వెలుగు: కేసులలో పరిశోధన పారదర్శకంగా ఉండాలని, మహిళల రక్షణకు పెద్దపీట వేయాలని సీపీ అనురాధ సిబ్బందికి సూచించారు. గురువారం సీపీ ఆఫీస్ లో గజ్వేల్ డివిజన్ పోలీస్ అధికారులతో పెండింగ్ కేసులపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పోక్సో కేసులలో నిందితులను వెంటనే అరెస్టు చేసి 60 రోజుల్లోపు కేసు పరిశోధన పూర్తి చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలన్నారు. వివిధ కేసులకు సంబంధించిన డేటా ప్రతిరోజు సిస్టమ్లో ఎంట్రీ చేయాలని సూచించారు.
గంజాయి ఇతర మత్తు పదార్థాలను ఉక్కుపాదంతో అణిచివేయాలని, స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ముందస్తు ప్రణాళికలు తయారు చేసుకోవాలని సూచించారు. డయల్ 100 కు కాల్ రాగానే వెంటనే రెస్పాండ్ అయి, స్వార్థమైనంత త్వరగా సంఘటనా స్థలానికి వెళ్లి సమస్యలు పరిష్కరించాలని సూచించారు. ఏసీపీ పురుషోత్తం రెడ్డి, సీఐలు సైదా, ముత్యంరాజు, లతీఫ్, మహేందర్ రెడ్డి, రామకృష్ణ, శ్రీధర్ గౌడ్, ఏవో యాదమ్మ పాల్గొన్నారు.