
సిద్దిపేట రూరల్, వెలుగు: యోగాలో సూర్యనమస్కారాలకు ప్రత్యేక స్థానం ఉందని సిద్దిపేట సీపీ అనురాధ అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా యోగాసనా స్పోర్ట్స్ అసోసియేషన్, వ్యాస మహర్షి యోగా సొసైటీ ల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 21 రోజుల సూర్య నమస్కారం ఛాలెంజ్ వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈనెల 27 నుంచి ఫిబ్రవరి 16 వరకు ఆసక్తి గల యోగ సాధకులు ప్రతిరోజు కనీసం 21 సూర్య నమస్కారాలు చేస్తూ రికార్డు చేసి తమ గ్రూప్ లో పోస్ట్ చేయాలని సూచించారు. కార్యక్రమంలో వ్యాస మహర్షి యోగా సొసైటీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, సిద్దిపేట జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అశోక్ , తోట సతీశ్ పాల్గొన్నారు.