
దుబ్బాక, వెలుగు : దుబ్బాక సర్కిల్ లోని దుబ్బాక, భూంపల్లి, మిరుదొడ్డి పోలీస్ స్టేషన్లను బుధవారం సీపీ అనురాధ ఆకస్మికంగా సందర్శించారు. స్టేషన్లలో రికార్డులు తనిఖీ చేసి, ఆయా కేసుల్లో పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. పార్లమెంట్ఎన్నికల నేపథ్యలో పోలీసులు అలర్ట్గా ఉండాలన్నారు.
మద్యం, నగదు రవాణపై నిఘా పెట్టాలని సూచించారు. విలేజ్లను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని తెలిపారు. గంజాయి లాంటి మత్తుపదార్థాలపై ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు. సీఐ శ్రీనివాస్, ఎస్ఐలు గంగరాజు, రవికాంత్, పరశురాం పాల్గొన్నారు.