- సీపీ అనురాధ
సిద్దిపేట టౌన్, వెలుగు : ప్రయాణికుల భద్రత కోసం అభయ యాప్ ప్రారంభించామని సీపీ అనురాధ తెలిపారు. బుధవారం జిల్లాలోని ఆటోల యాజమానుల నుంచి అవసరమైన డాక్యుమెంట్లు, సమాచారం సేకరించి డిజిటలైజ్ చేసిన తర్వాత సమాచారాన్ని అభయ యాప్ రూపంలో తీసుకొచ్చామన్నారు. ఆటో డ్రైవర్లకు అభయ క్యూఆర్ కోడ్, పేపర్ల ను అందజేసినట్లు తెలిపారు. దాదాపు 1250 ఆటోలకు అభయ యాప్ స్టిక్కరింగ్ వేశామన్నారు.
మిగతా ఆటోలకు త్వరలో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అభయ యాప్ స్టిక్కర్ ను ఆటో డ్రైవర్ వెనుక సీట్ కు అతికించాలని, తమ ఆటోలో ప్రయాణం సురక్షితమని ప్రయాణికులకు నమ్మకం కల్పించాలన్నారు. ఆటోలో ఎక్కిన మహిళలు క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆటో డ్రైవర్ వివరాలు, నెంబర్ వస్తాయని, ఆటోలో ఏవైనా వస్తువులు మరిచిపోతే వెంటనే ఆటోను ట్రేస్ చేసి స్వాధీనం చేసుకోవచ్చన్నారు. ఏసీపీ మధు, ఇన్స్పెక్టర్లు ప్రవీణ్ కుమార్, మురళి, శ్రీధర్, శ్రీధర్ గౌడ్, సీఐలు వాసుదేవరావు, విద్యాసాగర్, శ్రీను, మల్లేశం గౌడ్ పాల్గొన్నారు.