షీ టీం కంప్లైంట్ బాక్సుల ఏర్పాటు :సీపీ అనురాధ

షీ టీం కంప్లైంట్ బాక్సుల ఏర్పాటు :సీపీ అనురాధ

సిద్దిపేట రూరల్, వెలుగు: జిల్లా వ్యాప్తంగా స్కూళ్లలో, కాలేజీల వద్ద, బస్టాండ్లలో షీ టీం కంప్లైంట్ బాక్సులు ఏర్పాటు చేస్తున్నట్లు ఆదివారం సీపీ అనురాధ తెలిపారు. ఈ కంప్లైంట్ బాక్స్ కీ  సంబంధిత షీటీమ్ బృందాల వద్ద ఉంటుందని, వారు రెండు మూడు రోజులకు ఒకసారి తాళం తీసి అందులో ఉన్న ఫిర్యాదులను పరిశీలించి వారికి కౌన్సెలింగ్ నిర్వహిస్తారని తెలిపారు. అయినప్పటికీ మార్పు రాకపోతే చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామన్నారు. చిట్టి రాసి వేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. హుస్నాబాద్ లోని మైనార్టీ స్కూల్, గర్ల్స్, బాయ్స్ హై స్కూల్స్, సిద్దిపేట న్యూ బస్టాండ్, సిద్దిపేట ఓల్డ్ బస్టాండ్, గజ్వేల్ పార్క్ లో కంప్లైంట్ బాక్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

Also Read :- గెస్ట్​ లెక్చరర్ ​పోస్టుల దరఖాస్తుకు నేడే చివరితేదీ