సైబర్ నేరస్తుల పట్ల అలర్ట్ రుణమాఫీ విషయంలో ఎలాంటి మెస్సేజ్​లు ఓపెన్ చేయవద్దు : సీపీ అనురాధ

సైబర్ నేరస్తుల పట్ల అలర్ట్ రుణమాఫీ విషయంలో ఎలాంటి మెస్సేజ్​లు ఓపెన్ చేయవద్దు : సీపీ అనురాధ

సిద్దిపేట రూరల్, వెలుగు : సైబర్ నేరస్తుల పట్ల అలర్ట్​గా ఉండాలని, రుణమాఫీ విషయంలో ఎలాంటి మెస్సేజ్​లు ఓపెన్ చేయవద్దని, ఏదైనా సమస్య ఉంటే నేరుగా బ్యాంకుకు వెళ్లి అధికారులతో మాట్లాడాలని సీపీ అనురాధ సూచించారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం రుణమాఫీ చేపట్టిన నేపథ్యంలో కొందరు సైబర్ నేరస్తులు ఏదో ఒక బ్యాంకు పేరిట ఏపీకే ఫైల్స్ పంపిస్తున్నారని

దాన్ని ఓపెన్ చేస్తే మన వాట్సప్ వాళ్ల కంట్రోల్ కి వెళ్లి పోతుందన్నారు. ఏపీకే ఫైల్స్ వస్తే ఎట్టి పరిస్థితిల్లో ఓపెన్ చెయ్యకూడదన్నారు. ఎవరైనా మోసపోయినట్లయితే ఆలస్యం చెయ్యకుండా 1930 కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని తెలిపారు.