బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు పాటుపడాలి : సీపీ అనురాధ

బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు పాటుపడాలి : సీపీ  అనురాధ

సిద్దిపేట రూరల్, వెలుగు: బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని సీపీ అనురాధ సూచించారు. శనివారం ఆమె సీపీ ఆఫీస్ లో జూలై 1 నుంచి 31 వరకు నిర్వహించే ఆపరేషన్ ముస్కాన్ నిర్వహణ కోసం వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ అధికారులు మిస్సింగ్ చిల్డ్రన్ కేసులను ట్రేస్ అవుట్ చేయాలని, అన్ని డిపార్ట్​మెంట్ల అధికారులు కలిసి టీం వర్క్ చేయాలని, బాల కార్మికులు పనిచేసే  స్పాట్స్ ని గుర్తించి  టీమ్స్ తో వెళ్లి  రైడ్ చేయాలని సూచించారు. ఆపరేషన్ ముస్కాన్, ఆపరేషన్ స్మైల్ ద్వారా ఇప్పటివరకు 946 మంది  పిల్లలను సేవ్ చేశామని తెలిపారు. 

వీధి బాలలు కనిపిస్తే  1098 లేదా, డయల్ 100, సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ కంట్రోల్ రూమ్  వాట్సాప్ నంబర్  87126 67100, ఉమెన్ సేఫ్టీ వింగ్ హైదరాబాద్ 9440700906 లకు ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు. అనంతరం ఆపరేషన్ ముస్కాన్ కు సంబంధించిన పోస్టర్లను రిలీజ్ చేశారు. సమావేశంలో డీడబ్ల్యూవో శారద, సీఐలు గురుస్వామి, దుర్గ, సీడబ్ల్యూసీ చైర్మన్ రాజలింగం, డీసీపీవో రాము, బాల రక్ష భవన్ కోఆర్డినేటర్ మమత పాల్గొన్నారు.