
సిద్దిపేట రూరల్, వెలుగు: యువత గంజాయికి బానిసై బంగారు భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దని సీపీ అనురాధ సూచించారు. ఆదివారం ఆమె సీపీ ఆఫీసులో మీడియా సమావేశంలో మాట్లాడారు. నేరగాళ్లు టెక్నాలజీని వాడుకొని కొత్త కొత్త మార్గాల్లో గంజాయి విక్రయిస్తున్నారని ఇందుకు ఇటీవల వెలుగులోకి వచ్చిన గంజాయి చాక్లెట్ల ఉదంతమే ఉదాహరణ అన్నారు.
తల్లిదండ్రులు తరచూగా తమ పిల్లలను గమనిస్తూ ఉండాలన్నారు. ఎవరికైనా గంజాయి, డ్రగ్స్‌కి సంబంధించిన వివరాలు తెలిస్తే పోలీస్‌కంట్రోల్ రూమ్ నెంబర్ 8712667100, జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారుల నెంబర్లు 8712667446, 8712667447 లకు సమాచారం అందించాలన్నారు. వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు.